Andhra Pradesh: కోనసీమ జిల్లాలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మహిళా ఎంపీడీవో

ఏపీలో ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కుతున్న ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. తాజాగా మరో అవినీతి ఉద్యోగి ఏసీబీకి పట్టుబడ్డారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం మహిళా ఎంపీడీవో విజయలక్ష్మి ఏసీబీ వలలో చిక్కుకున్నారు. ఎంపీ లాడ్స్ మ్యాచింగ్ గ్రాంట్ విడుదలకు రాజులపాలెం ఉప సర్పంచ్ నుండి ఆమె రూ. 50 వేలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఈ నెల 6న ఆయన రూ. 10 వేలు అందజేశారు. మిగిలిన రూ. 40 వేలను ఈరోజు ఆమెకు అందిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేశారు.
Andhra Pradesh
Dr BR Ambedkar Konaseema District
MPDO
Corruption
ACB

More Telugu News