దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు కెప్టెన్ గా శిఖర్ ధావన్
- టీ20 ప్రపంచకప్ కు ముందు సొంత గడ్డపై రెండు సిరీస్ ఆడనున్న భారత్
- దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ నుంచి ప్రపంచ కప్ లో ఆడే ఆటగాళ్లకు విశ్రాంతి
- వీవీఎస్ లక్ష్మణ్ కు హెడ్ కోచ్ బాధ్యతలు అప్పగించే అవకాశం
మరోవైపు దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ నుంచి టీ20 ప్రపంచ కప్ లో పాల్గొనే ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వన్డే జట్టుకు శిఖర్ ధావన్ కు కెప్టెన్సీ బాధ్యతలను కట్టబెట్టింది. మరోవైపు ఈ సిరీస్ కు హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలను చేపట్టే అవకాశం ఉంది.