వర్షాలతో బెంగళూరు ఇప్పటికే అతలాకుతలం... మరో 5 రోజులకు వర్ష సూచన చేసిన ఐఎండీ
- ఇటీవల బెంగళూరులో భారీ వర్షాలు
- నగరం జలమయం
- ఇంకా ముంపులోనే లోతట్టు ప్రాంతాలు
- మరోసారి వర్ష సూచనతో ఆందోళనలో బెంగళూరు వాసులు
అయితే, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బెంగళూరు వాన కష్టాలు ఇప్పట్లో తీరవని చెబుతోంది. బెంగళూరు సహా కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో మరో 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తాజా ప్రకటనలో వెల్లడించింది. బెంగళూరులో ఓ మోస్తరు వర్షాలు పడతాయని చెప్పిన ఐఎండీ, ఎగువ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.
ఇప్పటికే బెంగళూరు పరిసర జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి. బెంగళూరులోని పలు ప్రాంతాలు ఇంకా నీటి ముంపులోనే ఉన్నాయి. మరికొన్ని రోజుల పాటు వర్షాలు పడతాయన్న హెచ్చరికల నేపథ్యంలో, బెంగళూరు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.