'ఆదిత్య 369' కోసం బాలయ్యను తీసుకోవడానికి కారణమదే: సింగీతం
సింగీతం శ్రీనివాసరావు అనే పేరు వినగానే ఆయన తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రాలు కళ్లముందు కదలాడతాయి. బాలకృష్ణతో ఆయన మూడు సినిమాలను రూపొందించారు. ఆ సినిమాలలో 'ఆదిత్య 369' ఒకటి. ఈ సినిమాను గురించి తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సింగీతం శ్రీనివాసరావు ప్రస్తావించారు.
'ఆదిత్య 369' సినిమాలో హీరో .. కాలంలో వెనక్కి వెళ్లినట్టుగా చూపించాలి. అలా వెళ్లినప్పుడు రెండు కథలు మనకి ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఒకటి అక్బర్ కాలమైతే .. రెండవది కృష్ణదేవరాయలవారి కాలం. ఈ కథలు మాత్రమే ఇతర ముఖ్యమైన పాత్రలతో కలిసి రక్తి కట్టించేవిగా అనిపిస్తాయి. 'అక్బర్' చరిత్ర .. రాయలవారి చరిత్ర పట్ల జనాలకి కొంతవరకూ అవగాహన ఉంది. పైగా ఆ పాత్రలలో ఎన్టీఆర్ మెప్పించారు.
ఆ తరువాత ఆ పాత్రలకి బాలయ్య మాత్రమే సెట్ అవుతారు. అందువలన 'ఆదిత్య 369' కోసం ఆయనను ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంది. బాలయ్య కూడా ఉత్సాహంగానే ఉన్నారు. కాకపోతే ఎప్పుడు కుదురుతుందా అనేదే చూడాలి" అంటూ చెప్పుకొచ్చారు.