YSRCP: వైసీపీ మ‌హిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్య‌లు... టీడీపీ మ‌హిళా నేత‌పై కేసు న‌మోదు

singanamala police files a case on tdp leader undavalli anusha overs social media posts on ysrcp mla jonnalagadda padmavathi
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ మ‌హిళా నేత‌, అనంత‌పురం జిల్లా శింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తిపై సోష‌ల్ మీడియాలో అనుచిత వ్యాఖ్య‌లు పోస్ట్ చేసిన వైనంపై శింగ‌న‌మ‌ల పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. ఈ కేసులో ఏలూరు జిల్లాకు చెందిన టీడీపీ మ‌హిళా నేత ఉండ‌వ‌ల్లి అనూష‌ను నిందితురాలిగా చేరుస్తూ శింగ‌న‌మ‌ల పోలీసులు కేసు న‌మోదు చేశారు. 

అంతేకాకుండా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్య‌ల‌పై 3 రోజుల్లోగా సంజాయ‌షీ ఇవ్వాలంటూ ఉండ‌వ‌ల్లి అనూష‌కు ఏలూరులోని ఆమె ఇంటి వ‌ద్దే శింగ‌న‌మ‌న‌ల పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ వ్య‌వ‌హారంలో భీమిశెట్టి శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కే ఉండ‌వ‌ల్లి అనూష‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.
Go Back to Shorts
YSRCP
TDP
Jonnalagadda Padmavathi
Undavalli Anusha
Singanamala Police
Social Media

More Telugu News