బిగ్ బాస్ షోపై సింగర్ స్మిత స్పంద‌న ఇదే
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బిగ్ బాస్ షోపై సింగర్ స్మిత స్పంద‌న ఇదే

pop singer smitha responded on big boss show
  • బిగ్ బాస్ షో త‌న‌కు న‌చ్చ‌ద‌న్న స్మిత‌
  • అవ‌కాశం వ‌స్తే వెళ్లి త‌ప్పు చేయ‌న‌ని వెల్ల‌డి
  • కుటుంబాన్ని వ‌దిలి అన్ని రోజులు అక్క‌డ ఉండాల్సిన ప‌ని లేద‌ని వ్యాఖ్య‌
స్టార్ మా టీవీలో ప్ర‌సారం అవుతున్న బిగ్ బాస్ షోపై చాలా మంది ఆస‌క్తి చూపుతుంటే...కొంద‌రు షోను విమ‌ర్శిస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు. సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ ఈ షోపై ఇప్ప‌టికే ప‌లుమార్లు ప‌రుష ప‌ద‌జాలంతో స్పందించిన విష‌యం తెలిసిందే. తాజాగా తెలుగు పాప్ సింగ‌ర్ స్మిత కూడా బిగ్ బాస్ షోపై స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె బిగ్ బాస్ షోపై త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. 

బిగ్ బాస్ షో త‌న‌కు న‌చ్చ‌ద‌ని చెప్పిన స్మిత‌.. ఒక‌వేళ త‌న‌కు ఆ షో నుంచి ఆహ్వానం వ‌స్తే మాత్రం అందుకు అంగీక‌రించి త‌ప్పు చేయ‌న‌ని చెప్పారు. అన్ని రోజుల పాటు కుటుంబాన్ని వ‌దిలి ఆ షోలో ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆమె అన్నారు. త‌న‌కు తెలిసిన వాళ్లు ఎవ‌రైనా ఆ షోకు వెళ‌తామ‌ని చెబితే... ఏం వ‌చ్చింది మీకు? అని నిల‌దీస్తాన‌ని తెలిపారు. కొంత‌మందిని అక్క‌డ పెట్టి మీరు త‌న్నుకోండి... మేము టీఆర్పీల‌ను పెంచుకుంటామ‌ని చెప్ప‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ఆమె అన్నారు. బిగ్ బాస్ షోను తాను చూడ‌న‌ని, చూసినా త‌న‌కు అర్థం కాద‌ని ఆమె అన్నారు.
Maa TV
Star Maa TV
Bigg Boss
Smitha
Pop Singer

More Telugu News