Javelin: నీరజ్ చోప్రా జావెలిన్ ను వేలంలో రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసిన బీసీసీఐ

BCCI grabs Neeraj Chopra javelin in auction
షార్ట్స్‌లో చూడండి
గతేడాది జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ లో భారత జావెలిన్ వీరుడు నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించడం తెలిసిందే. నీరజ్ చోప్రా ఉపయోగించిన జావెలిన్ ను గతేడాది ఆన్ లైన్ లో వేలం వేశారు. ఈ జావెలిన్ ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది. 

టోక్యో ఒలింపిక్స్ అనంతరం నీరజ్ చోప్రా తాను ఉపయోగించిన జావెలిన్లలో ఒకదాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి కానుకగా ఇచ్చారు. మోదీ వద్ద ఉన్న వివిధ వస్తువులతో పాటు ఈ జావెలిన్ ను కూడా ఇ-వేలం ప్రక్రియలో ఉంచారు. గతేడాది సెప్టెంబరు-అక్టోబరు మధ్యన ఈ వేలం నిర్వహించారు. తాజాగా బిడ్లను తెరవగా, బీసీసీఐ అత్యధిక ధరతో నీరజ్ చోప్రా జావెలిన్ ను సొంతం చేసుకుంది. 

అదే సమయంలో, ఫెన్సింగ్ క్రీడాకారిణి భవానీ దేవి ఖడ్గం వేలంలో రూ.1.25 కోట్లు పలికింది. పారాలింపిక్ చాంపియన్ సుమీత్ ఆంటిల్ కు చెందిన జావెలిన్ కు రూ.1 కోటి ధర పలికింది. ఇక, మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ కు చెందిన గ్లోవ్స్ కు రూ.91 లక్షల ధర లభించింది.

ఈ ఇ-వేలంలో ప్రధానికి లభించిన 1,348 జ్ఞాపికలను విక్రయానికి ఉంచగా, మొత్తం 8,600 బిడ్లు దాఖలయ్యాయి.
Go Back to Shorts
Javelin
Neeraj Chopra
BCCI
E-Auction
Narendra Modi
India

More Telugu News