పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడీపీ అభ్యర్థులు వీరే!
- పశ్చిమ రాయలసీమ స్థానానికి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి
- తూర్పు రాయలసీమకు కంచర్ల శ్రీకాంత్
- విశాఖపట్నం స్థానానికి త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తానన్న చంద్రబాబు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇకపై ఏ ఎన్నిక జరిగినా టీడీపీ పోటీ అనివార్యమని చెప్పిన చంద్రబాబు... గెలుపే ధ్యేయంగా పోరాటం సాగించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజలు ఎప్పటికప్పుడు ఓటర్ల జాబితాలను పరిశీలించుకుంటూ ఉండాలన్న చంద్రబాబు.. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా వైసీపీ వారు దొంగ ఓట్లను చేరుస్తారన్నారు.