లక్కీ లక్ష్మణ్ నుంచి 'ఓ మేరీ జాన్' సాంగ్ ప్రోమో విడుదల...  భారీ రెస్పాన్స్ వస్తోందన్న నిర్మాత

  • బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా లక్కీ లక్ష్మణ్
  • ఏఆర్ అభి దర్శకత్వం
  • దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై నిర్మాణం
  • మీడియాతో మాట్లాడిన నిర్మాత హరిత గోగినేని
బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా మోక్ష కథానాయికగా వస్తున్న చిత్రం 'లక్కీ లక్ష్మణ్'. ఏఆర్ అభి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై హరిత గోగినేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి తాజాగా 'ఓ మేరీ జాన్' గీతానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. 'ఓ మేరీ జాన్' గీతాన్ని సీనియర్ గీత రచయిత భాస్కరభట్ల రచించారు.

కాగా, విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ లిరికల్ సాంగ్ ప్రోమోకు విశేషమైన స్పందన వస్తోందని నిర్మాత హరిత గోగినేని వెల్లడించారు. పూర్తి పాటను సెప్టెంబరు 3వ తేదీ ఉదయం 9.33 గంటలకు విడుదల చేస్తామని చెప్పారు. సీనియర్ టెక్నీషియన్లు పనిచేస్తున్న ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుందని, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో నే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని అన్నారు. 

'లక్కీ లక్ష్మణ్' చిత్రంలో రాజా రవీంద్ర, సమీర్, కాదంబరి కిరణ్ తదితరులు నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.


More Telugu News

O Meri Jaan Song promo Lucky Lakshman Sohail Moksha Haritha Gogineni AR Abhi Tollywood