నేను అతడిని పూర్తిగా వదులుకుంటున్నాను... అతడు ఇక మీవాడే!: జయం రవికి బ్రేకప్ చెప్పిన గాయని కెనీషా

Kenisha Announces Breakup with Jayam Ravi
  • నటుడు జయం రవితో రిలేషన్‌కు ముగింపు పలికిన సింగర్ కెనీషా
  • మనస్తాపంతో చెన్నై నగరాన్ని విడిచి వెళుతున్నట్లు ప్రకటన
  • తనకిష్టమైన సంగీతాన్ని కూడా వదులుకుంటున్నట్లు వెల్లడి
  • ఆన్‌లైన్ వేధింపులు, ట్రోలింగ్ వల్లే ఈ నిర్ణయమన్న గాయని
  • ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేస్తున్నట్లు సుదీర్ఘ పోస్ట్
తమిళ నటుడు జయం రవి, గాయని కెనీషా మధ్య రిలేషన్‌షిప్‌పై గత కొంతకాలంగా వార్తలు వస్తుండడం తెలిసిందే. ఈ వార్తలతో తీవ్ర మనస్తాపానికి గురైన కెనీషా, జయం రవితో తన బంధానికి ముగింపు పలుకుతున్నట్లు పరోక్షంగా ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సుదీర్ఘ భావోద్వేగ పోస్ట్ పెట్టిన ఆమె, చెన్నై నగరాన్ని విడిచి వెళుతున్నట్లు, తనకిష్టమైన సంగీతాన్ని కూడా వదులుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

"ఈ కథలోకి ఎంతో ప్రేమతో అడుగుపెట్టాను, కానీ ఇప్పుడు నిశ్శబ్దంతో వెనుదిరుగుతున్నాను. ఒక మనిషిని రక్షించే ప్రయత్నంలో నన్ను నేను కోల్పోయాను. ప్రదర్శనలకు ప్రాధాన్యమిచ్చే ఈ లోకంలో మంచితనానికి విలువ లేదు," అని కెనీషా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ట్రోలింగ్ చేసేవారిని, రవి కుటుంబ సభ్యులను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. "ఎవరైతే అతడి (జయం రవి)పై పూర్తి హక్కులు ఉన్నాయని భావిస్తున్నారో వారికి చెబుతున్నాను. అతడు (జయం రవి) ఇక పూర్తిగా మీవాడే. ఇకపై ఎలాంటి వివరణలు ఇవ్వను, యుద్ధాలు చేయలేను" అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ప్రపంచం అబద్ధాలకోరులతో నిండిపోయిందని, భావోద్వేగాలతో అల్లిన కథలనే జనం నమ్ముతారని ఆమె వాపోయారు. "నేను ఓడిపోయాను. చెన్నై విడిచి వెళుతున్నాను. నా సంగీతాన్ని, నా జీవితానికి సంబంధించిన ప్రతిదాన్ని వదిలేస్తున్నాను. ఈ ఆన్‌లైన్ వేధింపులు, ట్రోలింగ్స్ వల్లే నేను వీటన్నింటికీ దూరమవుతున్నాను. ఫెమినిజం గెలిచింది, కానీ సంతోషం ఓడిపోయింది" అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా డిలీట్ చేస్తున్నట్లు ప్రకటించారు.

కాగా, తన భార్య ఆర్తి నుంచి 2024లో విడిపోతున్నట్లు జయం రవి ప్రకటించారు. ఆ తర్వాతే ఆయన కెనీషాతో రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం మొదలైంది. తాజాగా కెనీషా పెట్టిన పోస్ట్‌తో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Go Back to Shorts
Jayam Ravi
Kenisha
Jayam Ravi Kenisha breakup
Kollywood
Tamil actor
Singer Kenisha
Relationship rumors
Chennai
Divorce rumors
Aarthi Jayam Ravi

More Telugu News