రేపు వరంగల్ లో బీజేపీ సభ: అనుమతికై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్
- రేపటితో ముగియనున్న బండి సంజయ్ పాదయాత్ర
- బీజేపీ బహిరంగసభకు అనుమతిని నిరాకరించిన పోలీసులు
- సభకు ముఖ్య అథితిగా విచ్చేయనున్న జేపీ నడ్డా
దీంతో, ఆర్ట్స్ కాలేజీ యాజమాన్యం నుంచి కూడా ఇదే రకమైన సమాధానం వచ్చింది. పోలీసుల నుంచి సభకు అనుమతి రాకపోవడంతో బీజేపీ నేతలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ షెడ్యూల్ ప్రకారం రేపు మధ్యాహ్నం 3 గంటలకు సభను నిర్వహించనున్నారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.