'మీ సేవ'కు గుర్తింపు... తెలంగాణ ప్రభుత్వానికి మరో అవార్డు
- ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద పురస్కారం
- తెలంగాణకు అవార్డు ప్రకటించిన ఎకనామిక్ టైమ్స్
- ఢిల్లీలో డిజిటెక్ కాంక్లేవ్-2022
- అవార్డు అందుకున్న మంత్రి కేటీఆర్
'మీ సేవ' ద్వారా మెరుగైన రీతిలో, నాణ్యమైన డిజిటల్ సేవలు అందిస్తున్నారని 'ఎకనామిక్ టైమ్స్' వర్గాలు కొనియాడాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అత్యుత్తమ స్థాయిలో ఉన్నాయని పేర్కొన్నాయి. కాగా, ఈ అవార్డుకు తెలంగాణను ఎంపిక చేసే క్రమంలో, 'ఎకనామిక్ టైమ్స్' వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల నివేదికలను పరిశీలించడంతో పాటు, క్షేత్రస్థాయిలో అధ్యయనం నిర్వహించింది.