మెగా ఫ్యాన్స్ కు పండగ... 'గాడ్ ఫాదర్' టీజర్ విడుదల

Chiranjeevi God Father movie teaser released
  • మలయాళ హిట్ చిత్రం 'లూసిఫర్' రీమేక్ 'గాడ్ ఫాదర్'
  • ప్రధాన పాత్రలు పోషించిన నయనతార, సత్యదేవ్, సముద్రఖని
  • కీలక పాత్ర పోషించిన సల్మాన్ ఖాన్
మెగా అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. చిరంజీవి తాజా చిత్రం 'గాడ్ ఫాదర్' టీజర్ విడుదలయింది. నటుడు మురళీ శర్మ వాయిత్ తో టీజర్ మొదలయింది. '20 ఏళ్లు ఎక్కడకు వెళ్లాడో ఎవరికీ తెలియదు. సడన్ గా తిరిగి వచ్చిన ఆరేళ్లలో చాలా మంచి పాప్యులారిటీని సంపాదించుకున్నాడు' అంటూ టీజర్ ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించారు. టీజర్ లో నయనతార, సత్యదేవ్, సముద్రఖని, బ్రహ్మాజీలు కనిపించారు. 

ఈ చిత్రంలో చిరంజీవి రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారు. మలయాళంలో ఘన విజయం సాధించిన 'లూసిఫర్' చిత్రానికి రీమేక్ గా ఈ సినిమాను నిర్మించారు. ట్రైలర్ చివర్లో సల్మాన్ ఖాన్ ను ఉద్దేశిస్తూ 'వెయిట్ ఫర్ మై కమాండ్ బ్రదర్' అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. 
Go Back to Shorts
Chiranjeevi
Tollywood
God Father Movie
Teaser

More Telugu News