రేపే తెలంగాణ టూర్కు అమిత్ షా రాక... టూర్ షెడ్యూల్ ఇదిగో
- మధ్యాహ్నం 3.40 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరనున్న అమిత్ షా
- మునుగోడులో దళిత కార్యకర్త ఇంటిలో భోజనం
- రైతులతో మాట్లాడనున్న కేంద్ర హోం మంత్రి
- రాత్రి 9.30 గంటలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణం
ఢిల్లీ నుంచి బయలుదేరనున్న అమిత్ షా రేపు మద్యాహ్నం 3.40 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా బయలుదేరనున్న ఆయన సాయంత్రం 4.30 గంటలకు మునుగోడు చేరుకుంటారు. ఆ వెంటనే అక్కడే సీఆర్పీఎఫ్ అధికారులతో ఆయన భేటీ అవుతారు. అనంతరం మునుగోడులో బీజేపీకి చెందిన ఓ దళిత కార్యకర్త ఇంటిలో ఆయన భోజనం చేయనున్నారు.
ఈ తర్వాత అక్కడే రైతులతో మాట్లాడనున్న షా... అనంతరం మునుగోడు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభ ముగిసిన తర్వాత తిరిగి రాత్రి 8 గంటల సమయంలో శంషాబాద్ చేరుకోనున్న అమిత్ షా... ఓ గంటన్నర పాటు నోవాటెల్ హోటల్లో విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం రాత్రి 9.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఆయన ఢిల్లీ బయలుదేరి వెళతారు.