హిట్ కోసమే యంగ్ హీరో వెయిటింగ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హిట్ కోసమే యంగ్ హీరో వెయిటింగ్!

Nenu Meeku Baga Kavalsinavadini movie update
  • ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చిన కిరణ్ అబ్బవరం 
  • హీరోగా వరుసగా దక్కుతున్న అవకాశాలు
  • తాజా చిత్రంగా రూపొందిన 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని'
  • సెప్టెంబర్ 9వ తేదీన సినిమా విడుదల  
ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఓ నాలుగు సినిమాలు సంపాదించుకోవడం అంత తేలికైన విషయమేం కాదు. కానీ కిరణ్ అబ్బవరం మాత్రం ఒకేసారి ఒక అరడజను సినిమాలను చేతిలో పెట్టుకున్నాడు. సరైన హిట్ లేకుండా ఇతగాడికి ఇది ఎలా సాధ్యమైందబ్బా అని చాలామంది సోషల్ మీడియా ద్వారా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు కూడా. 

అలా ఆయన చేస్తున్న సినిమాలలో ముందుగా ప్రేక్షకులను పలకరించడానికి 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' రెడీ అవుతోంది. కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్య నిర్మాతగా మారిపోయి, ఈ సినిమాను నిర్మిస్తోంది. కిరణ్ అబ్బవరం జోడీగా సంజనా ఆనంద్ తెలుగు తెరకి పరిచయమవుతోంది. సెప్టెంబర్  9వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. 

ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని సమకూర్చాడు.  రీసెంట్ గా వదిలిన 'నచ్చావ్ అబ్బాయి' అనే పాటకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకి ముందు కిరణ్ నుంచి వచ్చిన రెండు సినిమాలు పరాజయం పాలయ్యాయి. అందువలన ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి.
Kiran Abbavaram
Sanjana
Nenu Meeku Baga Kavalsinavadini Movie

More Telugu News