అమ్మాయిలను బయటికి పంపించడానికి భయపడుతున్నారు: 'హైవే' ట్రైలర్ రిలీజ్
- కేవీ గుహన్ నుంచి 'హైవే'
- సైకో కిల్లర్ చుట్టూ తిరిగే కథ
- హీరోగా ఆనంద్ దేవరకొండ
- ఈ నెల 19 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్
'నగరంలో వరుస హత్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న సైకో కిల్లర్' అంటూ టీవీలో వస్తున్న న్యూస్ తో ఈ ట్రైలర్ మొదలవుతోంది. ఒక యువతి సైకో వలలో చిక్కుకోవడం .. ఒక వైపున పోలీసులు .. మరో వైపున హీరో ఆ యువతిని కాపాడటానికి ప్రయత్నిస్తుండటంపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు.
ఆ సైకో బారి నుంచి ఆ అమ్మాయిని వాళ్లు కాపాడారా లేదా? అనేదే కథ అనే విషయం అర్థమవుతోంది. కేవీ గుహన్ పాత్రలను తీర్చిదిద్దిన తీరు చూస్తే, సహజత్వానికి దగ్గరగా ఆయన ఈ కథను తీసుకువెళ్లాడనే విషయం అర్థమవుతోంది.
ఈ తరహా కథలపై గుహన్ కి మంచి పట్టుంది. అందువలన ఈ సినిమా అందరిలో ఆసక్తిని రేకేత్తిస్తోంది.