జింబాబ్వే పర్యటనకు దూరమైన భారత ఆల్ రౌండర్
- గాయంతో టూర్ కు దూరంగా ఉన్న వాషింగ్టన్ సుందర్
- ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీలో ఆడుతుండగా భుజానికి గాయం
- జింబాబ్వే వెళ్లకుండా బెంగళూరు ఎన్సీఏకు రానున్న సుందర్
దాంతో, తను జింబాబ్వే పర్యటనకు వెళ్లలేదని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ‘అవును, వాషింగ్టన్ సుందర్ జింబాబ్వే సిరీస్కు దూరమయ్యాడు. అతని ఎడమ భుజానికి గాయమైంది. అతను నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందవలసి ఉంటుంది’ అని చెప్పారు. ఈ నేపథ్యంలో సుందర్ జింబాబ్వే వెళ్లకుండా నేరుగా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కి రానున్నాడు. సుందర్ చివరగా ఫిబ్రవరిలో జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగాడు. తాజా గాయం కారణంగా అతని పునరాగమనం మరింత ఆలస్యం కానుంది.
మరోవైపు మూడు వన్డేల సిరీస్ కోసం లోకేశ్ రాహుల్ నాయకత్వంలోని భారత జట్టు ఇప్పటికే జింబాబ్వే చేరుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఈ నెల 18, 20, 22వ తేదీత్లో హరారే వేదికగా భారత్, జింబాబ్వే మధ్య మూడు వన్డేలు జరుగుతాయి.