దక్షిణాది రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీగా ప్రియాంకా గాంధీ
- తెలంగాణ, కర్ణాటకలకు పూర్తి స్థాయి ఇంచార్జీగా ప్రియాంక
- సీడబ్ల్యూసీ భేటీ తర్వాత అధికారిక ప్రకటన
- మునుగోడు ఉప ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం
తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు పార్టీ ఇంచార్జీగా ప్రియాంకా గాంధీ వ్యవహరించనున్నారు. అందులోనూ కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల పార్టీ శాఖలకు ఆమె పూర్తి స్థాయి ఇంచార్జీగా వ్యవహరిస్తారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ, మునుగోడు అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనున్న సమయాన కాంగ్రెస్ పార్టీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.