తెలంగాణ హైకోర్టుకు ఆరుగురు కొత్త జడ్జీలు...కొలీజియం సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం
- ఇదివరకే ప్రతిపాదించిన సుప్రీంకోర్టు కొలీజియం
- రాష్ట్రపతి ఆమోదంతో కేంద్రం ఉత్తర్వులు జారీ
- త్వరలోనే హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణం చేయనున్న జడ్జీలు
దీంతో కేంద్ర ప్రభుత్వం ఆరుగురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో ఏనుగుల వెంకట వేణుగోపాల్, నగేశ్ భీమపాక, పుల్ల కార్తీక్, కాజా శరత్, జగ్గన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వరరావులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా ఉత్తర్వుల నేపథ్యంలో వీరు త్వరలోనే హైకోర్టు న్యాయమూర్తులుగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.