ఏపీపై ఫిర్యాదు చేస్తూ కేఆర్ఎంబీకి 2 లేఖలు రాసిన తెలంగాణ ఈఎన్సీ
- అనుమతులు లేని ప్రాజెక్టులను నిలిపివేయాలన్న మురళీధర్
- గాలేరు- నగరి నుంచి హంద్రీ- నీవాలోకి నీటిని ఎలా తరలిస్తారని ప్రశ్న
- అది కృష్ణా జలాల అక్రమ తరలింపు కిందకే వస్తుందని ఫిర్యాదు
గాలేరు- నగరి ప్రాజెక్టు నుంచి హంద్రీ- నీవా ప్రాజెక్టులోకి ఏపీ సర్కారు నీటిని మళ్లిస్తోందని మురళీధర్ తన లేఖలో ఆరోపించారు. ఈ రెండు ప్రాజెక్టుల పనులను ఏపీ సర్కారు కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే కొనసాగిస్తోందని ఆయన తెలిపారు. అనుమతులు లేని ప్రాజెక్టులను తక్షణమే నిలుపుదల చేయాలని కోరారు. ఇప్పటికే ఈ విషయంపై కేఆర్ఎంబీకి పలుమార్లు ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. అయితే తమ అభ్యర్థనలను కేఆర్ఎంబీ ఇప్పటిదాకా అర్థం చేసుకోనేలేదని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గాలేరు- నగరి నుంచి హంద్రీ- నీవాలోకి నీటిని తరలిస్తే... కృష్ణా జలాలను అక్రమంగా తరలించినట్టే అవుతుందని ఆయన పేర్కొన్నారు.