మునుగోడు టీఆర్ఎస్లో ముసలం... కూసుకుంట్లకు టికెట్ ఇవ్వొద్దంటూ స్థానిక నేతల తీర్మానం
- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం
- చౌటుప్పల్లో భేటీ అయిన టీఆర్ఎస్ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు
- కూసుకుంట్లకు టికెట్ ఇస్తే పనిచేసేది లేదని వెల్లడి
ఈ క్రమంలో శుక్రవారం టీఆర్ఎస్లో అసమ్మతి సెగ రాజుకుంది. మునుగోడు పరిధిలోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు చౌటుప్పల్లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉప ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వరాదని వారంతా ఓ తీర్మానాన్ని ఆమోదించారు. కూసుకుంట్లకు టికెట్ ఇస్తే తాము పార్టీ విజయం కోసం పనిచేసేది లేదని కూడా వారు తేల్చి చెప్పారు. ఈ నెల 20న మునుగోడు భారీ బహిరంగ సభను నిర్వహించాలని పార్టీ అధినాయకత్వం భావిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.