సుప్రీంకోర్టులో వైఎస్ సునీతా రెడ్డి పిటిషన్... వివేకా కేసు దర్యాప్తులో పురోగతి లేదని ఫిర్యాదు
- వివేకా కేసుపై సుప్రీంకోర్టులో సునీతా రెడ్డి పిటిషన్
- నిందితులే దర్యాప్తు అధికారులపై కేసులు పెడుతున్నారని ఆరోపణ
- సునీత పిటిషన్ను ప్రస్తావిస్తూ టీడీపీ పోస్టులు
సుప్రీంకోర్టులో సునీతా రెడ్డి పిటిషన్ వేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ టీడీపీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో కొన్ని పోస్టులు పెట్టింది. 'రాఖీ పండుగ నాడే, న్యాయం కోసం ఓ చెల్లెలి పోరాటం' అంటూ కామెంట్ చేసిన టీడీపీ... 'అన్న పాలనలో నిజం బయటకు రాదా?' అని ప్రశ్నించింది. తన అన్న పాలన పైనే వైఎస్ సునీత ఫిర్యాదు చేశారంటూ టీడీపీ అందులో పేర్కొనడం గమనార్హం.