YSRCP: తెలుగు మ‌హిళ‌లు, తెలుగు యువ‌త‌, తెలుగు వృద్ధులంతా క‌లిసి వ‌చ్చినా వైసీపీని ఏమీ చేయ‌లేరు: కొడాలి నాని

kodali nani hits back tdp over ysrcp mp gorantla madhav issue
షార్ట్స్‌లో చూడండి
మ‌హిళ‌తో న‌గ్నంగా వీడియో కాల్ మాట్లాడిన‌ట్లుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై ఆ పార్టీ కీల‌క నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గురువారం స్పందించారు. ఆ వీడియోలో ఉన్న‌ది తాను కాద‌ని గోరంట్ల మాధ‌వ్ చెబుతున్నా... సిగ్గు లేకుండా టీడీపీ నేత‌లు ఇంకా వాదిస్తున్నార‌ని నాని మండిప‌డ్డారు. రాష్ట్రంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను గాలికి వ‌దిలేసి అన‌వ‌స‌ర విష‌యాల‌పై టీడీపీ నేత‌లు దృష్టి పెట్ట‌డం సిగ్గు చేట‌ని ఆయ‌న అన్నారు.

ఎంపీ మాధ‌వ్‌దిగా చెబుతున్న వీడియో ఫేక్ అని పోలీసులు చెబుతున్నా.. టీడీపీ నేత‌లు రాద్ధాంతం చేస్తున్నార‌ని నాని ఆరోపించారు. టీడీపీ నేత‌లు ఏమైనా లింగ ప‌రిశోధ‌న‌లో నిష్ణాతులా? అని కూడా ఆయ‌న ప్ర‌శ్నించారు. మాధ‌వ్ వీడియోను ప‌ట్టుకుని టీడీపీ వేలాడినా.... వైసీపీని గానీ, జ‌గ‌న్‌ను గానీ టీడీపీ ఏమీ చేయ‌లేద‌ని ఆయ‌న అన్నారు. తెలుగు మ‌హిళ‌లు, తెలుగు యువ‌త‌, తెలుగు వృద్ధులంతా క‌లిసి వ‌చ్చినా వైసీపీని ఏమీ చేయ‌లేరంటూ ఆయ‌న ఎద్దేవా చేశారు.
Go Back to Shorts
YSRCP
YS Jagan
Gorantla Madhav
Kodali Nani
TDP

More Telugu News