Team India: వెస్టిండీస్ తో చివరి టీ20లో టాస్ గెలిచిన టీమిండియా

నిన్న జరిగిన నాలుగో టీ20లో గెలిచిన టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకోవడంతో నేటి ఐదో టీ20 మ్యాచ్ నామమాత్రంగా మారింది. ఫ్లోరిడాలోని లాడర్ డేల్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ, రిషబ్ పంత్, భువనేశ్వర్ కుమార్ లకు విశ్రాంతి కల్పించారు. జట్టు కెప్టెన్ గా హార్దిక్ పాండ్య వ్యవహరిస్తున్నాడు. 

తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 6 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. 11 పరుగులు చేసిన ఓపెనర్ ఇషాన్ కిషన్... డొమినిక్ డ్రేక్స్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఓపెనర్ గా బరిలో దిగిన శ్రేయాస్ అయ్యర్ 25 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అతడికి జోడీగా దీపక్ హుడా (11 బ్యాటింగ్) ఆడుతున్నాడు.
Team India
Toss
West Indies
Florida
5th T20

More Telugu News