కాషాయ కండువా కప్పుకున్న దాసోజు శ్రవణ్
- ఢిల్లీలో సీనియర్ బీజేపీ నేతల సమక్షంలో పార్టీలో చేరిక
- అభినందనలు తెలియజేసిన బీజేపీ నేతలు
- పుష్పగుచ్ఛం అందించిన లక్ష్మణ్
ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ కు బీజేపీ నేతలు అభినందనలు తెలియజేశారు. ఎంపీ లక్ష్మణ్ ఆయనకు పుష్పగుచ్ఛాన్ని అందించారు. మంత్రి కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్ పార్టీ సభ్యత్వ కార్డును శ్రవణ్ కు అందించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోపాటు, దాసోజు శ్రవణ్ ఈ నెల 21న బీజేపీలో చేరతారని పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. అంతకంటే ముందే శ్రవణ్ బీజేపీలోకి వచ్చేయడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీలో అగ్ర కులాలకే ప్రాధాన్యం ఇస్తూ, బీసీ ఇతర వెనుకబడిన వర్గాల నేతలను అణగదొక్కే ప్రయత్నం జరుుగుతోందంటూ శ్రవణ్ ఆరోపణలు చేయడం తెలిసిందే.