రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన చంద్రబాబు
- ఢిల్లీలో చంద్రబాబు పర్యటన
- ముర్ము నివాసంలో టీడీపీ నేతల సందడి
- రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
- ఆమె అందరికీ స్ఫూర్తిప్రదాత అని కితాబు
అంతకుముందు చంద్రబాబు ప్రధాని మోదీతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొన్నేళ్లకాలంలో వీరిద్దరూ కలిసింది లేదు. ఈ నేపథ్యంలో, ఐదు నిమిషాల పాటు చంద్రబాబు, ప్రధాని మోదీ మధ్య ఏకాంత సమావేశం జరిగింది. అయితే వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారన్నది బయటికి తెలియరాలేదు.