ఈరోజు రాత్రి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయల్దేరనున్న సీఎం జగన్
- మధ్యాహ్నం ఆమదాలవలసలో స్పీకర్ తమ్మినేని కుమారుడి వివాహానికి హాజరుకానున్న సీఎం
- సాయంత్రం విశాఖ నుంచి హైదరాబాదుకు.. అటునుంచి ఢిల్లీకి పయనం
- రెండు రోజుల పాటు హస్తినలోనే మకాం వేయనున్న ముఖ్యమంత్రి
మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లి నుంచి బయల్దేరనున్న జగన్... మధ్యాహ్నం 3.40 గంటలకు ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరగనున్న అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడి వివాహానికి హాజరవుతారు. అనంతరం సాయంత్రం 5.20 గంటలకు విశాఖ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 6.55 గంటలకు హైదరాబాద్ లోని నార్సింగి ఓమ్ కన్వెన్షన్ లో జరిగే జీవీ ప్రతాప్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం రాత్రి 7.50 గంటలకు ఢిల్లీకి బయల్దేరుతారు.