ఈ ఘనత జగన్, భారతమ్మ, ఏపీ ప్రజల దీవెనల వల్లే సాధ్యమైంది: విజయసాయిరెడ్డి
- రాజ్యసభ చైర్మన్ స్థానంలో విజయసాయి
- ప్యానెల్ వైస్ చైర్మన్ గా అవకాశం
- ఆరేళ్ల కిందట ప్రస్థానం ప్రారంభమైందని వెల్లడి
- ఇప్పుడు అరుదైన అవకాశం దక్కిందని వివరణ
తొలిసారిగా రాజ్యసభను నడిపించే అవకాశం దక్కడాన్ని విశిష్ట గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఆరేళ్ల కిందట రాజ్యసభలో వైసీపీ తరఫున ఒకే ఒక్కడ్ని ఉండేవాడ్నని, ఇప్పుడిలా చైర్మన్ స్థానంలో సభను నడిపించే భాగ్యం లభించిందని వివరించారు. ఇదంతా కూడా జగన్, భారతమ్మ, ఏపీ ప్రజల దీవెనల వల్లే సాధ్యమైందని వినమ్రంగా తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా విజయసాయి పంచుకున్నారు.