ధర్నాకు దిగిన ప్రధాని మోదీ సోదరుడు
- అఖిల భారత చౌక ధరల దుకాణాల డీలర్ల సంఘం ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ప్రహ్లాద్ మోదీ
- డీలర్ల కమిషన్ పెంచాలని డిమాండ్ చేస్తూ ధర్నా
- రేపు తన సోదరుడిని కలవనున్న ప్రహ్లాద్ మోదీ
బియ్యం, గోధుమలు, పంచదారపై తమకు ఇచ్చే కమిషన్ లో కేంద్ర ప్రభుత్వం కేజీపై కేవలం 20 పైసలు మాత్రమే పెంచడం దారుణమని ప్రహ్లాద్ మోదీ అన్నారు. రేషన్ డీలర్లను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించాలని... సాయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. రేపు డీలర్ల సంఘం నాయకులంతా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని చెప్పారు. రేపు ప్రధాని మోదీని కలిసి వినతిపత్రాన్ని అందజేస్తామని అన్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కూడా కలుస్తామని చెప్పారు.