రజనీకాంత్ పాదాలకు నమస్కరించిన మాధవన్

R Madhavan seeks Rajinikanth blessing touches his feet
  • మాధవన్ ను సత్కరించిన రజనీకాంత్
  • రాకెటరీ సినిమా సక్సెస్ నేపథ్యంలో భేటీ
  • రజనీకి ధన్యవాదాలు చెబుతూ మాధవన్ ట్వీట్
‘రాకెటరీ: ద నంబీ ఎఫెక్ట్’ సినిమా సక్సెస్ ను ఆస్వాదిస్తున్న తమిళ నటుడు ఆర్ మాధవన్.. మరో దిగ్గజ నటుడు రజనీకాంత్ ను చెన్నైలోని ఆయన నివాసంలో కలుసుకున్నాడు. ఈ సందర్భంగా రజనీకాంత్ ఆయనకు శాలువ కప్పి సత్కరించారు. అదే సమయంలో మాధవన్ రజనీకాంత్ పాదాలకు నమస్కరించి గౌరవ భావాన్ని చాటుకున్నాడు. ఆ సమయంలో నంబి నారాయణన్ కూడా అక్కడే ఉన్నారు. 

ఈ ఫొటోలను మాధవన్ స్వయంగా ట్విట్టర్ పేజీలో షేర్ చేశాడు. ‘‘నంబి నారాయణన్ సమక్షంలో పరిశ్రమ అంటే కనిపించే ఒకే ఒక్కడు, దిగ్గజ నటుడి నుంచి ఆశీర్వచనాలు తీసుకోవడం.. నిజంగా ఈ క్షణం శాశ్వతంగా గుర్తుండిపోతుంది. రాకెటరీ గురించి మీ మంచి మాటలకు, అభిమానానికి ధన్యవాదాలు రజనీకాంత్ సర్. మీ ప్రోత్సాహం మమ్మల్ని పూర్తిగా పునరుజ్జీవింప చేస్తుంది. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం’’అంటూ మాధవన్ ట్వీట్ చేశాడు. నంబి నారాయణన్ ఇస్రో మాజీ శాస్త్రవేత్త. 

Go Back to Shorts
R Madhavan
seeks
blessings
rajinikanth
tamil

More Telugu News