గాడ్ ఫాదర్ కోసం... సల్మాన్ ఖాన్ తో చిరంజీవి స్టెప్పులు
- చిరంజీవి హీరోగా గాడ్ ఫాదర్
- మోహన్ రాజా దర్శకత్వంలో చిత్రం
- కీలకపాత్రలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్
- ప్రభుదేవా కొరియోగ్రఫీలో చిరంజీవి, సల్మాన్ పై పాట
దీనికి సంబంధించిన అప్ డేట్ ను చిరంజీవి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. భాయ్ తో (సల్మాన్ ఖాన్) కాలు కదిపానని, ప్రభుదేవా అద్భుతంగా నృత్యరీతులు సమకూర్చాడని చిరంజీవి పేర్కొన్నారు. ఈ పాట కచ్చితంగా కన్నులపండుగలా ఉంటుందని హామీ ఇచ్చారు. గాడ్ ఫాదర్ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.