ఇంటికి రూ. 3,419 కోట్ల కరెంట్ బిల్లు.. షాక్ తో అస్వస్థతకు గురైన వ్యక్తి!
- గ్వాలియర్ లో ఒక ఇంటికి షాకిచ్చిన విద్యుత్ శాఖ
- బాధితుల ఫిర్యాదుతో పొరపాటును సరిదిద్దుకున్న అధికారులు
- బాధితులకు రూ. 1,300 బిల్లు ఇచ్చిన వైనం
ఈ బిల్లును చూసిన ఆమె మామ (భర్త తండ్రి) షాక్ కు గురై, తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వేల కోట్ల రూపాయల బిల్లును చూసి తన తండ్రి అస్వస్థతకు గురయ్యారని ప్రియాంక గుప్తా భర్త సంజీవ్ కంకనే తెలిపారు. ఈ విషయాన్ని ప్రియాంక, సంజీవ్ లు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తప్పును సరిదిద్దుకున్న అధికారులు రూ. 3,419 కోట్ల బిల్లును వెనక్కి తీసుకుని, రూ. 1,300 వాస్తవ బిల్లును అందించారు.