Sensex: హమ్మయ్య... కరోనా కొత్త కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య పెరిగింది..అప్డేట్స్ ఇవిగో!

Recoveries are more than Corona new cases in India
  • గత 24 గంటల్లో 16,866 కేసుల నమోదు
  • కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 18,148
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,50,877
దేశంలో కొన్ని రోజులుగా 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. నిన్న కొత్త కేసుల నమోదు కొంత మేర తగ్గింది. గత 24 గంటల్లో 16,866 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 18,148 మంది కరోనా నుంచి కోలుకోగా... 41 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,50,877 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 7.03 శాతంగా ఉంది. 

ఇప్పటి వరకు 4,32,28,670 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు 5,26,074 మంది బలయ్యారు. ప్రస్తుతం దేశంలో క్రియాశీల రేటు 0.34 శాతంగా, రికవరీ రేటు 98.46 శాతంగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,02,17,66,615 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 16,82,390 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

More Telugu News

Sensex
Nifty
Stock Market