కాలికి తగిలిన గాయం వల్ల కేటీఆర్ ప్రజాసేవకు అంతరాయం కలిగినట్టు తెలిసింది: బర్త్ డే విషెస్ తెలిపిన పవన్ కల్యాణ్
- నేడు కేటీఆర్ 46వ పుట్టినరోజు
- ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపిన పవన్
- కాలి గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి, సహృదయులు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ పవన్ కల్యాణ్ ఓ ప్రకటన చేశారు. కాలికి తగిలిన గాయం వల్ల కేటీఆర్ ప్రజాసేవకు అంతరాయం కలిగినట్టు తెలిసిందని వెల్లడించారు. గాయం నుంచి కోలుకుని ఆయన యథావిధిగా ప్రజాసేవలో మమేకం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. కేటీఆర్ కు దీర్ఘాయుష్షు, ఆనందకరమైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.