బాసర ట్రిపుల్ ఐటీలో సెల్ ఫోన్ వినియోగంపై నిషేధం... భగ్గుమంటున్న విద్యార్థులు
- డిమాండ్ల సాధన కోసం ట్రిపుల్ ఐటీ విద్యార్థుల పోరు
- కీలక నిర్ణయం తీసుకున్న ఇన్చార్జి వీసీ
- సెల్ ఫోన్ వాడకం నిషేధిస్తూ ఆదేశాలు జారీ
- ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
సెల్ ఫోన్ వినియోగంపై నిషేధించడం పట్ల విద్యార్థులు భగ్గుమంటున్నారు. విద్యార్థుల ఉద్యమాన్ని, డిమాండ్లను అణచివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని స్టూడెంట్ గవర్నెన్స్ కౌన్సిల్ మండిపడింది.