మామిడికాయ కావాలని మారాం చేసిన మేనకోడల్ని చంపేపిన కిరాతకుడు
- యూపీలో ఘోరం
- వ్యక్తి అన్నం తింటుండగా వచ్చిన మేనకోడలు
- మామిడికాయ కావాలని పదేపదే కోరిన వైనం
- ఇనుపరాడ్ తో కొట్టి, కత్తితో గొంతుకోసిన వ్యక్తి
ఆ చిన్నారి మృతదేహాన్ని ఓ గోనెసంచిలో కుక్కాడు. కాగా, తమ కుమార్తె కనిపించకపోవడంతో ఖైరూ నిషా తల్లిదండ్రులు వెదకడం ప్రారంభించారు. ఉమర్దీన్ కూడా ఏమీ ఎరగనివాడిలా గ్రామస్తులతో పాటే బాలిక కోసం వెదికాడు. అయితే, పోలీసులు అతడిని అనుమానించడంతో పారిపోయాడు.
బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు షురూ చేశారు. ఎట్టకేలకు నిందితుడ్ని గురువారం రాత్రి ఓ అటవీప్రాంతంలో అరెస్ట్ చేశారు. అతడి నుంచి హత్యకు ఉపయోగించిన ఓ ఐరన్ రాడ్, కత్తిని స్వాధీనం చేసుకున్నారు.