స్మృతి ఇరానీ కూతురుకి గోవాలో బార్ ఉందన్న కాంగ్రెస్.. అంతా అబద్ధమన్న కేంద్ర మంత్రి
- అమేథీలో రాహుల్‌ను ఓడించినందుకే తనను టార్గెట్ చేస్తున్నారన్న స్మృతి
- 18 ఏళ్లున్న తన కూతురు కళాశాలకు వెళుతోందని వెల్లడి
- గోవాలోనే కాకుండా మరెక్కడా తమకు బార్లు లేవని స్పష్టీకరణ
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని ఈ వివాదంలోకి లాగిన స్మృతి ఇరానీ...అమేథీలో రాహుల్ గాంధీని తాను ఓడించిన కారణంగానే తనను, తన కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తోందని ఆమె ఆరోపించారు. అయినా 18 ఏళ్ల వయసున్న తన కూతురు ప్రస్తుతం కళాశాలకు వెళుతోందని చెప్పిన ఇరానీ... బార్‌లను నడిపేంత వయసు తన కూతురుకు ఇంకా రాలేదని తెలిపారు. గోవాలోనే కాకుండా దేశంలో మరెక్కడా కూడా తనకు గానీ, తన కూతురుకు గానీ, తన కుటుంబానికి గానీ బార్లు లేవని ఆమె స్పష్టం చేశారు.