హాంకాంగ్‌లోని నీరవ్ మోదీ ఆస్తులను సీజ్ చేసిన ఈడీ
- రూ.28 వేల కోట్ల రుణాలను ఎగవేసిన వజ్రాల వ్యాపారి
- 2018లో దేశం దాటి పారిపోయిన వైనం
- ఇప్పటికే నీరవ్ ఆస్తుల్లో కొన్నింటిని సీజ్ చేసిన ఈడీ
తాజాగా సీజ్ చేసిన ఆస్తులతో కలిపి ఇప్పటిదాకా నీరవ్ మోదీకి చెందిన రూ.2,650.07 కోట్ల విలువ చేసే ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకులకు దాదాపుగా రూ.28 వేల కోట్ల పైచిలుకు రుణాలను ఎగవేసిన నీరవ్... 2018లో దేశం వదిలి పరారైన సంగతి తెలిసిందే. తొలుత అమెరికా, ఆ తర్వాత ఇంగ్లండ్ చేరిన నీరవ్‌ను ఇటీవలే బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు.