కాలేజీ విద్యార్థుల మధ్య ముద్దుల పోటీ.. పోలీసుల అదుపులో విద్యార్థి
- ఆరు నెలల క్రితం జరిగిన ఘటన
- వారం రోజుల క్రితం వాట్సాప్‌లో షేర్ చేసిన యువకుడు
- అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
- ఇద్దరినీ సస్పెండ్ చేసిన కాలేజీ యాజమాన్యం
అయితే, ఈ వీడియో ఇప్పటిది కాదని, ఆరు నెలల క్రితం నాటిదని మంగళూరు పోలీస్ కమిషనర్ ఎన్.శశికుమార్ తెలిపారు. వారం రోజుల క్రితం ఈ వీడియోను యువకుడు వాట్సాప్‌లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కాలేజీ యాజమాన్యం వారిని హెచ్చరించి కాలేజీ నుంచి తొలగించింది.
అయితే, ఈ ముద్దుల కాంపిటిషన్‌పై విద్యార్థుల తల్లిదండ్రులు కానీ, కాలేజీ యాజమాన్యం కానీ ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదని కమిషనర్ తెలిపారు. కిస్సింగ్ కాంపిటిషన్ సందర్భంగా విద్యార్థులు ఏమైనా డ్రగ్స్ ఉపయోగించారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.