సర్కారీ బడుల విద్యార్థుల కోసం రూ.1.06 కోట్లు వెచ్చించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే... అభినందించిన మంత్రి హరీశ్ రావు
- 37 వేల మంది విద్యార్థులకు 2.3 లక్షల నోట్ బుక్కుల కొనుగోలు
- అందుకోసం రూ.1.06 కోట్లు ఖర్చు చేసిన మహిపాల్ రెడ్డి
- విద్యార్థులకు నోట్ బుక్కులను పంపిణీ చేసిన మంత్రి హరీశ్
ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు సాయం చేసిన మహిపాల్ రెడ్డిని హరీశ్ రావు ఆకాశానికెత్తేశారు. తన సొంత నిధులతో ఎమ్మెల్యే ఈ నోట్ బుక్కులను కొనుగోలు చేశారని హరీశ్ రావు తెలిపారు. రూ.1.06 కోట్లతో 37,000 మంది విద్యార్థుల కోసం 2,30,000 నోట్ బుక్కులను ఎమ్మెల్యే కొన్నారని మంత్రి తెలిపారు.