విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించిన డైరెక్టర్ శ్రీను వైట్ల భార్య

Director Srinu Vaitla wife Rupa files for divorce
  • స్టార్ డైరెక్టర్ గా ఒకప్పుడు వెలుగు వెలిగిన శ్రీను వైట్ల
  • ఫ్యాషన్ డిజైనర్ రూపను ప్రేమించి పెళ్లాడిన శ్రీను
  • కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య కొనసాగుతున్న విభేదాలు
టాలీవుడ్ లో తన కంటూ ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకున్న దర్శకుడు శ్రీను వైట్ల. ఒకప్పుడు ఆయన రూపొందించిన సినిమాలన్నీ సూపర్ హిట్లే. ఆయనతో సినిమా చేయడానికి అగ్ర హీరోలు ఎదురు చూసేవారు. శ్రీను వైట్ల సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే నమ్మకం ఇండస్ట్రీలో ఉండేది. వెంకీ, ఆనందం, దుబాయ్ శ్రీను, దూకుడు, ఢీ వంటి సూపర్ హిట్ సినిమాలను శ్రీను వైట్ల తెరకెక్కించారు. అయితే ఆ తర్వాత ఆయన అదృష్టం తిరగబడింది. వరుస ఫ్లాపులతో ఆయన గ్రాఫ్ పడిపోయింది. ఆ తర్వాత ఆయనకు ఛాన్సులు కూడా రాకుండా పోయాయి. చాలా కాలం తర్వాత ఒక సినిమా మొదలు పెట్టినా అది ఇంత వరకు సెట్స్ మీదకు రాలేదు. 

మరోవైపు శ్రీను వైట్ల వైవాహిక జీవితం కూడా సవ్యంగా లేదని వార్తలొచ్చాయి. ఈ క్రమంలో విడాకులు కావాలంటూ ఆయన భార్య రూప కోర్టు మెట్లెక్కినట్టు తాజా సమాచారం. రూపను శ్రీను వైట్ల ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. రూప కూడా చాలా సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య గత కొన్నేళ్లుగా విభేదాలు నడుస్తున్నాయట. 

ఈ క్రమంలో, మ్యూచువల్ డైవోర్స్ కుదరకపోవడంతో... ఆమె విడాకుల కోసం కోర్టు మెట్లెక్కినట్టు చెబుతున్నారు. కుటుంబ సమస్యల వల్ల తన కెరీర్ పై శ్రీను వైట్ల ఫోకస్ చేయలేకపోతున్నారని అంటున్నారు.
Go Back to Shorts
Srinu Vaitla
Wife
Rupa
Divorce
Tollywood

More Telugu News