ఎర్ర ఉల్లిపాయ.. తెల్ల ఉల్లిపాయ.. ఏది ఎక్కువ మంచిది?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎర్ర ఉల్లిపాయ.. తెల్ల ఉల్లిపాయ.. ఏది ఎక్కువ మంచిది?

Red onions or white onions The healthier variety is
  • తెల్ల ఉల్లిపాయల్లో ఔషధ గుణాలు ఎక్కువ
  • యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ ప్రాపర్టీలు
  • ఆహారంలో రోజువారీ తీసుకోవచ్చు
  • గుండెకు కూడా మంచిదే
మార్కెట్లో ఎర్రటి ఉల్లిపాయే ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎక్కువ మంది వినియోగించే రకం కూడా ఇదే. అప్పుడప్పుడు తెల్ల ఉల్లిపాయలు కూడా కనిపిస్తుంటాయి. ఏవైనా ఉల్లిపాయలే కదా..? అనుకుంటాం. కానీ, ఈ  రెండింటిలో ఏది ఎక్కువ మంచిది? అని ప్రశ్నిస్తే నిస్సంకోచంగా తెల్ల ఉల్లిపాయలేనని వైద్యులు చెబుతున్నారు.

‘‘నిజమే తెల్ల ఉల్లిపాయలతో మన శరీరానికి ఎంతో మేలు ఉంది. వాటిల్లో యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ (వాపు రాకుండా చేసే గుణం), యాంటీబయాటిక్ గుణాలు దండిగా ఉన్నాయి. ఆయుర్వేదంలో వీటికి ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది’’ అని పోషకాహార నిపుణురాలు డాక్టర్ రచనా అగర్వాల్ తెలిపారు. తెల్ల ఉల్లిపాయలతో ప్రయోజనాలు మరిన్నింటిని ఆమె వివరించారు.

ఇన్ఫెక్షన్లు..
తెల్ల ఉల్లిపాయల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్లు తగ్గేందుకు సాయపడతాయి. కళ్లు, ముక్కు, చెవి ఇన్ఫెక్షన్లపై మంచి ప్రభావం చూపిస్తాయి. 

అసిడిక్ స్వభావం
కార్బొహైడ్రేట్లు ఉన్న పదార్థాలను దేశవాసులు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇవి అసిడిక్ గుణాన్ని కలిగి ఉంటాయి. దీనివల్ల అసిడిటీ సమస్య ఏర్పడుతుంది. అలాగే, మన శరీరం ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం పెరుగుతుంది. తెల్ల ఉల్లిపాయలు ఆల్కలిన్ స్వభావంతో ఉంటాయి. కనుక అసిడిక్ స్వభావాన్ని తగ్గిస్తాయి. 

శ్వాసకోస సమస్యలు 
శ్వాసకోస సమస్యలపైనా తెల్ల ఉల్లిపాయలు మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఊపిరితిత్తుల్లో వాపు గుణాన్ని తగ్గించి, శ్వాస మెరుగ్గా ఉండేందుకు సాయపడతాయి. తెల్ల ఉల్లిపాయల రసాన్ని, కొంచెం తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. కాటన్ తీసుకుని ఉల్లిపాయల రసాన్ని ఛాతీ భాగంలో కూడా రాసుకోవచ్చు. 

కేశాలకూ తెల్ల ఉల్లిపాయలు మంచి చేస్తాయి. ఉల్లిపాయ రసాన్ని వెంట్రుక కుదుళ్లకు రాసుకోవచ్చు. తెల్ల, ఎర్ర ఉల్లిపాయల్లో చాలా వరకు సాధారణ పోషకాలు ఒకటే. కానీ, తెల్ల ఉల్లిపాయల్లో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే, ఎర్ర ఉల్లిపాయలంత ఘాటుగా తెల్లవి ఉండవు. 

ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఫైబర్ కూడా ఉంటుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది. యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ గుణాలు దండిగా ఉండడం గుండెకు కూడా మేలు చేస్తుంది.
Red onions
white onions
health benefits
Onions

More Telugu News