అవసరమైతే కాల్చేపారేయండి.. పరిస్థితిని అదుపులోకి తీసుకురండి: సైన్యానికి పూర్తి అధికారాలు ఇచ్చిన విక్రమసింఘే
- శ్రీలంకలో పూర్తిగా అదుపుతప్పిన పరిస్థితులు
- ఎమర్జెన్సీని ప్రకటించిన తాత్కాలిక అధ్యక్షుడు విక్రమసింఘే
- శాంతిభద్రతలను కాపాడేందుకు ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చిన తాత్కాలిక అధ్యక్షుడు
ఈ నేపథ్యంలో దేశంలో ఆయన ఎమర్జెన్సీని విధించారు. అంతేకాదు, శాంతిభద్రతలను కాపాడేందుకు ఆర్మీకి పూర్తి అధికారాలు ఇచ్చారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఏది అవసరమైతే అది చేయాలని, అవసరమైతే కనిపించిన వారిని కాల్చిపడేయాలని వారికి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విక్రమసింఘే మాట్లాడుతూ ఫాసిస్టుల చేతుల్లోకి దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెళ్లనివ్వబోనని అన్నారు. తాత్కాలిక అధ్యక్షుడిగా తాను తప్పుకునే ప్రయత్నం చేయాలని ఆందోళనకారులు చూస్తున్నారని చెప్పారు.