విప‌క్ష నేత అఖిలేశ్‌ ఇంట సీఎం ఆదిత్య‌నాథ్‌!

up cmyogi adityanath visits akhilesh yadav house
  • ఆదివారం మృతి చెందిన ములాయం భార్య సాధ‌నా గుప్తా
  • ములాయంకు సంతాపం తెలిపేందుకు వెళ్లిన ఆదిత్య‌నాథ్
  • అఖిలేశ్ ప‌క్క‌నే కూర్చుని ములాయంతో మాట్లాడిన యోగి
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నోలో ఆదివారం రాత్రి పొద్దుపోయిన త‌ర్వాత ఓ ఆస‌క్తిక‌ర దృశ్యం క‌నిపించింది. నిత్యం ప‌దునైన విమ‌ర్శ‌ల‌తో ప‌ర‌స్ప‌రం విమ‌ర్శించుకుంటున్న సీఎం యోగి ఆదిత్యనాథ్, స‌మాజ్ వాదీ పార్టీ అధినేత‌, యూపీ అసెంబ్లీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత అఖిలేశ్ యాద‌వ్‌లు ప‌క్క‌ప‌క్క‌నే కూర్చుని క‌నిపించారు. వారి ఎదురుగా అఖిలేశ్ తండ్రి, యూపీ మాజీ ముఖ్య‌మంత్రి ములాయం సింగ్ యాద‌వ్ కూడా కూర్చుని ఉన్నారు.

ములాయం రెండో భార్య సాధ‌నా గుప్తా ఆదివారం క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఈ వార్త తెలిసిన వెంట‌నే ఆమె మృతికి సంతాపం ప్ర‌క‌టించిన ఆదిత్య‌నాథ్... ఆ త‌ర్వాత ఆదివారం రాత్రి ములాయం నివాసానికి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ములాయంకు త‌న ప్ర‌గాఢ సానుభూతిని ప్ర‌క‌టించిన ఆదిత్య‌నాథ్...అక్క‌డే కొద్దిసేపు గ‌డిపారు. ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న అఖిలేశ్ ప‌క్క‌నే కూర్చున్న ఆదిత్య‌నాథ్.. ములాయం, అఖిలేశ్‌ల‌తో కాసేపు మాట్లాడారు.
Go Back to Shorts
Uttar Pradesh
Yogi Adityanath
Akhilesh Yadav
BJP
Samajwadi Party

More Telugu News