వాళ్లందరూ చిల్లర వ్యక్తులు.. ‘ధాకడ్’ పరాజయంపై కంగనా రనౌత్

Kangana Ranaut reacts to Dhaakad flopping
‘ధాకడ్’ సినిమాపై ఇంటర్నెట్‌లో వ్యతిరేక ప్రచారం జరిగిందని, సినిమా పరాజయానికి అదే కారణమని బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ అన్నారు. అలాంటి వార్తలు రాసేవారిని ఆమె చిల్లర వ్యక్తులుగా అభివర్ణించారు. ధాకడ్ సినిమా పరాజయంతో నిర్మాత ఆస్తులు అమ్ముకున్నారంటూ వస్తున్న వార్తలపైనా ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. ఆ సినిమా నిర్మాత ఆస్తులు, ఆఫీసులు అమ్ముకోలేదని పేర్కొన్నారు. సినిమా ఫలితంపై నిర్మాత దీపక్ ముకుత్ సంతృప్తిగానే ఉన్నట్టు ఆమె చెప్పారు.

తన సినిమాపై ఇప్పటికీ ఇంటర్నెట్‌లో వందలాది వ్యతిరేక వార్తలు వస్తున్నాయని, వాటిని తాను చదువుతున్నానని పేర్కొన్నారు. వీటివల్లే తన సినిమా ప్లాప్ అయిందన్న కంగన.. గంగూబాయి కఠియావాడి, జుగ్‌జుగ్‌జీయో, 83 సినిమాల ప్లాప్‌ల గురించి వారు ఎందుకు రాయడం లేదని ప్రశ్నించారు. కాగా, అర్జున్ రాంపాల్, దివ్యదత్తా, కంగన తదితరులు నటించిన ఈ సినిమాను రూ. 80 కోట్ల బడ్జెట్‌తో కొత్త దర్శకుడు రజనీష్ ఘాయ్ తెరకెక్కించారు. కంగన కెరియర్‌లోనే డిజాస్టర్‌గా నిలిచిన ఈ సినిమా కేవలం రూ. 4 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
Go Back to Shorts
Kangana Ranaut
Bollywood
Dhaakad
Gangubai Kathiawadi
JugJugg Jeeyo

More Telugu News