బట్లర్ ను భువనేశ్ ఎలో బోల్తా కొట్టించాడో వీడియో చూడండి..!
- తొలి ఓవర్లోనే మ్యాజిక్ చేసిన భువీ
- లెగ్ స్టంప్ గా వచ్చిన బంతికి కొట్టే ప్రయత్నం చేసిన బట్లర్
- చిక్కకుండా తప్పించుకుని పోయి వికెట్లను పడేసిన బాల్
ఇంగ్లండ్ పొట్టి క్రికెట్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ ను గోల్డెన్ డకౌట్ చేశాడు. నిజానికి స్వింగ్ తో భువీ మాయ చేశాడనే చెప్పుకోవాలి. మొదటి ఓవర్ లో భువీ సంధించిన బంతిని బట్లర్ చాలా ఇంటెలిజెంట్ గా స్ట్రయిక్ చేయబోయాడు. లెగ్ స్టంప్ గా వచ్చిన బంతిని కొట్టబోగా.. అది బ్యాట్, కాలు మధ్య నుంచి మెలికలు తిరుగుతూ వెళ్లి వికెట్లను పడగొట్టేసింది. పరిమిత ఓవర్ల కెప్టెన్సీని అందుకున్న తర్వాత బట్లర్ ఆడిన ఏడు మ్యాచుల్లో ఇది నాలుగో డకవుట్.