అల్లూరి సీతారామరాజు బంధువులు, సంబంధీకులతో మోదీ ప్రత్యేక భేటీ

Modi will meet Alluri Sitharama Raju grand grand sons
  • రేపు భీమవరంలో పర్యటించనున్న మోదీ
  • అల్లూరి సోదరుడు, సోదరి మనవళ్లతో మోదీ భేటీ
  • మొత్తం 37 మందిని గుర్తించిన అధికారులు
ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో రేపు పర్యటించనున్న ప్రధాని నరేంద్రమోదీ అల్లూరి సీతారామరాజు బంధువులు, సంబంధీకులతో భేటీ కానున్నారు. ఈ మేరకు అల్లూరి సోదరుడు, సోదరి మనవలు, సైన్యంలోని కీలక వ్యక్తులకు చెందిన మనవలు, మునిమనవళ్లు మొత్తం 37 మందిని అధికారులు గుర్తించారు.

వీరందరితో మోదీ రేపు ప్రత్యేకంగా భేటీ అవుతారు. నిజానికి ప్రధాని సభా వేదికపైకే వీరిని ఆహ్వానించాల్సి ఉండగా భద్రతా కారణాల రీత్యా దానిని విరమించుకుని ప్రధానితో ప్రత్యేక భేటీ ఏర్పాటు చేశారు. కాగా, వేదికపై మోదీతోపాటు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి రోజా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రఘురామ కృష్ణరాజు తదితరులు ఉంటారు.
Go Back to Shorts
Alluri Sitharama Raju
Narendra Modi
BJP
Bheemavaram

More Telugu News