'దసరా' సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
- నాని హీరోగా రూపొందుతున్న 'దసరా'
- ఈ సినిమాతో కొత్త దర్శకుడి పరిచయం
- నానితో కీర్తి సురేశ్ కి ఇది రెండో సినిమా
- అక్టోబర్లో గానీ .. జనవారిలోగాని రిలీజ్ చేసే ఛాన్స్
నాని ఇంతవరకూ ఈ స్థాయి రఫ్ లుక్ తో కనిపించలేదు. అందువలన ఈ సినిమా ఫస్టు లుక్ వచ్చిన దగ్గర నుంచి అందరిలో ఆసక్తి పెరుగుతూపోతోంది. అయితే ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా ఈ సినిమా షూటింగు ఆగిపోయిందనే ప్రచారం రెండు మూడు రోజులుగా జోరుగా జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల స్పందించాడు. ఈ సినిమా షూటింగు అనుకున్నట్టుగానే జరుగుతోందనీ, ఆగిపోయిందంటూ ప్రచారం చేయడం కరెక్ట్ కాదని అన్నాడు. ఈ సినిమాపై అప్ డేట్స్ ను తాము ఇస్తూనే ఉంటామనీ .. అనవసరమైన పుకార్లను నమ్మవద్దని ఆయన కోరాడు. ఈ సినిమాను 'దసరా'కిగానీ .. సంక్రాంతికి గాని విడుదల చేయనున్నారు.