ఇలాంటివి జరగాల్సింది కాదు.. నుపుర్ శర్మనూ అరెస్టు చేయాలి: అసదుద్దీన్ ఒవైసీ
- ఉదయ్ పూర్ లో టైలర్ హత్యను ఖండించిన ఎంఐఎం నేత
- హింసను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించేది లేదని వెల్లడి
- నుపుర్ శర్మ వ్యాఖ్యల వల్లే ఇలాంటి ఘటనలని ఆరోపణ
ఆమెను సస్పెన్షన్ తో వదిలి పెట్టడం సరికాదు..
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మను కేవలం పార్టీ నుంచి సస్పెండ్ చేసి వదిలి పెట్టడం సరికాదని అసదుద్దీన్ పేర్కొన్నారు. ఆమెను కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఇలాంటి ఘటనలకు నుపుర్ శర్మ వ్యాఖ్యలే కారణమయ్యాయని మండిపడ్డారు.