అరేబియా సముద్రంలో అత్యవసరంగా దిగిన ఓఎన్జీసీ హెలికాప్టర్
- తొమ్మిది మందితో ప్రయాణిస్తున్న చాపర్
- ముంబయి తీరానికి సమీపంలో అత్యవసర పరిస్థితి
- సహాయచర్యలకు ఉపక్రమించిన కోస్ట్ గార్డ్, ఓఎన్జీసీ
- అందరినీ కాపాడిన వైనం
- నలుగురికి ఆసుపత్రిలో చికిత్స
వీరిని కాపాడేందుకు ఓ కోస్ట్ గార్డ్ విమానం రంగంలోకి దిగింది. సరకు రవాణా నౌక మాలవ్య-16ను కూడా సహాయక చర్యల కోసం మళ్లించారు. లైఫ్ బోట్ల సాయంతో హెలికాప్టర్ లోని వారిని వెలుపలికి తరలించారు. కాగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ముంబయిలోని ఓఎన్జీసీ ఆసుపత్రికి తరలించారు.